బాబు ప్రమాణ స్వీకారానికి రజనీ రాక
విజయవాడకు చేరుకున్న సూపర్ స్టార్
అమరావతి – ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ చీఫ్ , కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు.
ఈ సందర్బంగా దేశానికి చెందిన ప్రముఖులు, సినీ, రాజకీయ , వ్యాపార, వాణిజ్య, క్రీడా రంగాలకు చెందిన వారు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున కొందరిని ఆహ్వానించగా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఏపీ అతిథిలుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా ఆహ్వానించారు.
ఆయన పిలుపు మేరకు విజయవాడకు చేరుకున్నారు రజనీకాంత్. ఆయనతో పలువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు చోటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇవాళ తెల్ల వారు జామున టీడీపీ కూటమి తరపున చంద్రబాబు నాయుడు 24 మందితో కూడిన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి జాబితాను విడుదల చేశారు.