నలుగురిని నియమించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టుకు అదనంగా నలుగురు న్యాయమూర్తులను నియమించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు సీజేగా తిరుమల దేవి కొనసాగుతుండగా రేణుకా యార, నర్సింగ్ రావు నందికొండ, మధుసూధన్ రావులు రెండు సంవత్సరాల పాటు ఏజేలుగా పని చేయనున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు న్యాయమూర్తులు సీజేలుగా బాధ్యతలు చేపట్టారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టులో కొత్తగా ఇద్దరిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించింది.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో సుప్రీం కొలీజియం ఫుల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరలోనే అన్నింటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేసింది.