పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ – సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. తనపై ఉన్న కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ బేలా త్రివేది. దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీగా ఫైన్ వేస్తామని, తప్పుడు పిటిషన్ అంటూ మండిపడ్డారు. ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. కాగా సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు లాయర్ బాలయ్య దావా దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు. తనపై పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. మరో వైపు తను జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ జతకట్టింది. అనూహ్యంగా విజయం సాధించింది.
ఇదిలా ఉండగా ఇటీవల దేశ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం, ఆస్తులు కలిగిన సీఎంలలో నెంబర్ వన్ గా నిలిచాడు నారా చంద్రబాబు నాయుడు. ఏకంగా తన ఆస్తులు రూ. 900 కోట్లకు పైగానే ఉన్నాయని పేర్కొన్నారు.