Friday, April 4, 2025
HomeNEWSNATIONALఈషా ఫౌండేష‌న్ కు సుప్రీంకోర్టు ఊర‌ట

ఈషా ఫౌండేష‌న్ కు సుప్రీంకోర్టు ఊర‌ట

కాలుష్య నియంత్ర‌ణ రూల్స్ పాటించాల్సిందే

అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ్గీ వాసుదేవ‌న్ నిర్వ‌హిస్తున్న ఈషా ఫౌండేష‌న్ కు భారీ ఊర‌ట ల‌భించింది. చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ కోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ స్పష్టం చేసింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా జ‌గ్గీ వాసుదేవ‌న్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త‌గా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌కుడిగా త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటూ మోడీ, సీఎంల‌తో అంట‌కాగుతూ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా ఈషా ఫౌండేషన్ పై తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది . పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

యోగా, ధ్యాన కేంద్రంపై నిషేధం విధించింది. కోయంబత్తూరులోని వెల్లియంగిరి పర్వతాల దిగువ ప్రాంతంలో ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా నిర్మాణంపై జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ పై తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (TNPCB) నోటీసులను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం సమర్థించింది.

ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరినప్పటికీ, TNPCB అన్ని పర్యావరణ నిబంధనలు ఆదేశాలను పాటించాలని కోరింది. అయితే, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి తన ఉత్తర్వు ఒక ఉదాహరణ కాదని స్ప‌ష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments