కోర్టు దెబ్బకు దిగొచ్చిన గవర్నర్
అహంభావ పూరితం పనికి రాదు
న్యూఢిల్లీ – అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు గవర్నర్ పదవి ఉండ కూడదని స్పష్టం చేసింది కోర్టు. ఈ మేరకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. సీరియస్ కావడంతో ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు.
పొన్ముడితో ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ నైతికతకు విరుద్దమంటూ బహిరంగంగా ప్రకటించారు. తన స్థాయిని తగ్గించుకున్నారు. అంతే కాదు ఆయన గవర్నర్ గా కొలువు తీరిన నాటి నుంచి బీజేపీ కార్యకర్తగా మారారంటూ సీఎం స్టాలిన్ ఆరోపించారు.
కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది గవర్నర్ కు . దెబ్బకు ఆర్ఎన్ రవి తగ్గారు. పొన్ముడిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తిరిగి చేర్చుకున్నారు. 2011 నాటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్టే విధించారు. ఉన్నత విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. శిక్ష అనంతరం పొన్ముడితో ప్రమాణం చేయించేందుకు నిరాకరించారు గవర్నర్. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఏ మాత్రం రాజ్యాంగం పట్ల గౌరవం లేక పోతే ఎలా అని ప్రశ్నించింది.
తిరుక్కోయిలూర్ నుండి ఎమ్మెల్యేగా తిరిగి నియమితులయ్యారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని గవర్నర్ కు సిఫారసు చేశారు. దీనిని తిరస్కరించారు గవర్నర్. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వార్నింగ్ ఇచ్చింది.