NEWSNATIONAL

చండీగ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల చెల్ల‌దు

Share it with your family & friends

సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా చండీగ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల వివాదంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా సుదీర్గ విచారణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం చండీగ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల చెల్ల‌దంటూ తీర్పు చెప్పింది. రిట‌ర్నింగ్ అధికారి చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిల‌ర్ కుల్దీప్ కుమార్ ను మేయ‌ర్ గా ప్ర‌క‌టించింది సుప్రీంకోర్టు.

ఆప్ , కాంగ్రెస్, భార‌త ప్ర‌తిప‌క్ష కూట‌మి తొలిసారిగా ఎన్నిక‌ల విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం విశేషం. కాగా గ‌త నెల‌లో చండీగ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు కుల్దీప్ మేయ‌ర్ గా గెలుపొందారు. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అనిల్ మ‌సీహ్ త‌న‌కు అనుకూలంగా 8 ఓట్ల‌ను చెల్లుబాటు చేయ‌కుండా చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మ‌నోజ్ సోంక‌ర్ మేయ‌ర్ గా ప్ర‌క‌టించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.