కేజ్రీవాల్ కు సుప్రీం ఊరట
మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం కూడా పేర్కొంది ధర్మాసనం. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ సమయంలో ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును ఉపయోగించు కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఎన్నికలు అనేవి కీలకం. అవే ప్రజాస్వామ్యానికి మూలం. ఈ రెండూ లేక పోతే రాజ్యాంగం మన జాలదని పేర్కొంది. చట్టంలోని సౌలభ్యాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇవ్వడం కుదరని తెలిపింది.
అయితే జైలులో ఉన్న కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంపై పునరాలోచిస్తామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.