NEWSNATIONAL

పతంజ‌లి ఉత్ప‌త్తుల‌పై కోర్టు ఫైర్

Share it with your family & friends

ఔష‌ధంగా ప్ర‌చారం చేయ‌డంపై బ్యాన్

న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సీరియ‌స్ అయ్యింది. రామ్ దేవ్ బాబా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప‌తంజ‌లి ఉత్ప‌త్లుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఆయుర్వేదం పేరుతో భారీ ఎత్తున ఉత్ప‌త్తుల‌ను , మంందుల పేరుతో భారీ ఎత్తున విక్ర‌యిస్తోంది. దీనిపై ఎవ‌రి నియంత్ర‌ణ లేక పోవ‌డంపై ఆరా తీసింది.

ప‌తంజ‌లి ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది. త‌న ఉత్పత్తుల‌ను ఔష‌ధంగా ప్ర‌చారం చేయ‌కుండా నిషేధం విధించింది. కోర్టు ధిక్కారానికి ఎందుకు ప్రాసిక్యూట్ చేయ కూడ‌దో స‌మాధానం చెప్పాల‌ని కోరింది. ఈ మేర‌కు కంపెనీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ధ‌ర్మాస‌నం.

ఇందులో భాగంగా రామ్ దేవ్ బాబా ప‌తంజ‌లి కంపెనీకి ధిక్కార నోటీసు జారీ చేసింది. ప్ర‌భుత్వ ప‌రంగా స‌ర్టిఫికేష‌న్ లేకుండా ఎలా మందుల‌ను విక్ర‌యిస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇదిలా ఉండ‌గా క‌రోనా స‌మ‌యంలో క‌రోనిల్ పేరుతో మందును అమ్మే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది.

రామ్ దేవ్ బాబాపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డాక్ట‌ర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ సీరియ‌స్ అయ్యింది. చివ‌ర‌కు రామ్ దేవ్ బాబా క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో గొడ‌వ స‌ద్దు మ‌ణిగింది.