ఈవీఎంలపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మీరు గెలిచినప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్న
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మీరు గెలిచినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేదా? అని నిలదీసింది పిటిషన్ దారుడిని. కాగా
విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి నేతలు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ట్యాంపరింగ్‌పై ప్రశ్నించారని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు.
దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌కు తిరిగి వెళ్లాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పిటిషనర్ కేఏ పాల్ మాట్లాడుతూ ఈవీఎంల కారణంగా అసలైన ప్రజాస్వామ్యం కనిపించడం లేదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు, ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ జరగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకరు ఓడి పోతే ట్యాంపరింగ్ అంటారు..మరి గెలిస్తే కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇది మీరు వాదించే స్థలం కానే కాదంటూ జస్టిస్ లు విక్రమ్ నాథ్ , జస్టిస్ పీబీ వారాలేతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.