పశ్చిమ బెంగాల్ సర్కార్ పై సీజేఐ కామెంట్స్
నిరసనకారులపై ప్రభుత్వ జులుం ఎందుకు
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసుకు సంబంధించి మంగళవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్బంగా సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన అధికారాన్ని నిరసనకారులపై ప్రయోగించ రాదని స్పష్టం చేసింది. శాంతియుత ఆందోళనకారుల పట్ల సంయమనం పాటించాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్.
ఆర్జీ కర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ పై విచారణ జరుగుతున్న సమయంలో మరో కాలేజీలో ఎలా జాయిన్ అవుతాడంటూ ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతుందని, నేరస్థులను శిక్షిస్తుందని భావించారు. కానీ రాష్ట్రం ఎందుకు అలా చేయలేదో అనే విషయాన్ని అర్థం చేసుకోలేక పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు సీజేఐ.
దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించి ఆందోళన కొనసాగుతుండడంతో సుమోటోగా తీసుకోవాల్సి వచ్చిందని ధర్మాసనం పేర్కొంది.