గుజరాత్ హైకోర్టుకు పలు ప్రశ్నలు సంధించింది
ఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడ్ పై నమోదు చేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని స్పష్టం చేసింది. తనకు జరిగిన సన్మానానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ కవితను షేర్ చేశారు ఎంపీ. దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పూర్తిగా రెచ్చగొట్టేలా ఉందని, హింసను ప్రేరేపించేలా ఉందంటూ పేర్కొన్నారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
విచారణ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేసింది ధర్మాసనం. అసలు కవితను చదవకుండా ఎలా తీర్పు చెబుతారంటూ ప్రశ్నించారు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం. ఎంపీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో కవితను షేర్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢిపై ఎఫ్‌ఐఆర్‌ను ప్రశ్నిస్తూ, “సృజనాత్మకత” ముఖ్యమైనదని, ప్రశ్నలోని కవిత ఏ సమాజానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఈరోజు గుజరాత్ ప్రభుత్వానికి తెలిపింది.
‘ఏ ఖూన్ కే ప్యాసోన్ బాత్ సునో’ అనే కవితను చేశారు ఎంపీ. ఇది చివరికి ఒక కవిత. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎవరైనా హింసకు పాల్పడినా, మనం హింసకు పాల్పడబోమని ఈ కవిత పరోక్షంగా చెబుతోంది. అదే కవిత ఇచ్చే సందేశం. ఇది ఏ ప్రత్యేక సమాజానికి వ్యతిరేకం కాదు అని పేర్కొన్నారు.