ఢిల్లీ ఎల్జీ సక్సేనాపై కోర్టు కామెంట్స్
మీ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో ప్రధానంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కు చురకలు అంటించింది. మీ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతోందని మండిపడింది. ఇది మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది.
ఢిల్లీ నగర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ (ఎన్సీడీ) 18వ , చివరి స్థానానికి జరిగిన ఎన్నికను నిర్వహించడంలో ఎల్జీ సక్సేనా చేసిన హడావుడిని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. చైర్మన్ ను ఎన్నుకునే ఓటింగ్ పై స్టే విధించింది.
ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పూర్తిగా నియమావళిని ఉల్లంఘిస్తూ ఎన్నికలకు ఆదేశించడం వెనుక న్యాయపరమైన ఆధారాన్ని కూడా జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది.
అధికార పార్టీకి చెందిన ఆప్ నేత షెల్లీ ఒబేరాయ్ మేయర్ అధ్యక్షత వహించిన సమయంలో ఎల్జీకి ఎలా అధికారం ఉంటుందని ప్రశ్నించింది. ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుందని నిలదీసింది కోర్టు. ఇందులో కూడా రాజకీయం ఏమైనా ఉందా అని ఎల్జీని నిలదీశారు. బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఒబేరాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు సక్సేనా నుండి ప్రతిస్పందనను కోరింది.