విజయ్ షాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
ఢిల్లీ – ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్నాడు బీజేపీకి చెందిన మధ్య ప్రదేశ్ మంత్రి విజయ్ షా. దీనిపై సీరియస్ అయ్యింది రాష్ట్ర హైకోర్టు. తనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మనోడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు బెయిల్ కావాలని. కుదరదని తేల్చింది. వెంటనే క్షమాపణ చెప్పాలని, తనపై సిట్ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏం తమాషాగా ఉందా అని ప్రశ్నించింది.
సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడేందుకు సిగ్గు అనిపించడం లేదా అని నిలదీసింది. సభ్య సమాజానికి ఏం సమాధానం చెబుతారంటూ ఫైర్ అయ్యింది. సారీ చెప్పాడని అంటున్నారు..నిజంగానే చెప్పారా లేక ఏదో నామ్ కే వాస్తేగా చెప్పారా అనేది తమకు తెలియాలని, అందుకే సిట్ ను ఏర్పాటు చేయమంటూ ఆదేశించామన్నారు.
ఓ వైపు యావత్ దేశమంతా ఆపరేషన్ సిందూర్ పై ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటే, నిబద్దతతో , ఎంతో కష్టపడి , శ్రమకోర్చి ఆపరేషన్ లో పాల్గొన్న కల్నల్ గురించి మతం పేరుతో దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కడిగి పారేసింది.