వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్
వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఢిల్లీ – ఢిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం ఉందని, అత్యంత కాలుష్య నగరాల సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.. వాయు కాలుష్యంపై తమ ఆందోళన ఢిల్లీ గురించి మాత్రమే కాదని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్మూలనకు సంబంధించిన సమాచారం ఇవ్వనందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు పాలకులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మీకు బాధ్యత లేదా అని నిలదీసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాలలో ఢిల్లీతో పలు నగరాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు ధర్మాసనం.
అసలు మీరు ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. రాబోయే రోజుల్లో బతికే పరిస్థితులు లేకుండా పోయే ప్రమాదం ఉందని, కాలుష్య నియంత్రణ మండలి నిద్ర పోతుందా అని మండిపడింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. పాలకులు, అధికారులపై బాధ్యత ఉందని స్పష్టం చేసింది. దీనిని విస్మరించడం నేరమేనని హెచ్చరించింది.