సెక్రటరీ ఏం చేస్తున్నారంటూ నిలదీత
హైదరాబాద్ – పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పై మండి పడింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు మీ దృష్టిలో ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మరాఠా తరాహాలో శాసన సభ గడవు ముగిసే వరకా అంటూ సీరియస్ అయ్యింది. స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతానంటూ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. వచ్చిన వెంటనే బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో కొందరు జంప్ జిలానీలుగా మారారు. సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆపై శాసన సభలో బీఆర్ఎస్ మాజీ మంత్రులను అనరాని మాటలు అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్, కార్యదర్శి నిద్ర పోతున్నారా అంటూ నిలదీసింది.