Friday, April 4, 2025
HomeNEWSయూనివ‌ర్శిటీ భూముల జోలికి వెళ్ల‌వ‌ద్దు

యూనివ‌ర్శిటీ భూముల జోలికి వెళ్ల‌వ‌ద్దు

స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

హైద‌రాబాద్ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఏకి పారేసింది. ప్ర‌ధానంగా సీఎస్ శాంతి కుమారిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. ఆగ‌మేఘాల మీద హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ భూముల వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించింది. ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీశాఖ అనుమ‌తులు తీసుకున్నారా అని నిల‌దీసింది. నిద్ర పోతున్నారా అంటూ మండిప‌డింది. హెచ్ సీయూ భూముల విష‌యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గ‌చ్చిబౌలి స్థ‌లాల్లో ఎలాంటి ప‌నులు చేప‌ట్ట వ‌ద్దంటూ ఆదేశించింది.

అంతే కాకుండా త‌క్ష‌ణ‌మే ప‌నుల‌న్నీ నిలిపి వేయాల‌ని హెచ్చ‌రించింది స‌ర్కార్ ను. రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికలో చాలా కీలక అంశాలు ఉన్నాయని తెలిపింది. నెల రోజుల్లోగా నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించాలని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం. 6 నెలల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అడవిని నాశనం చేసే యాక్టివిటీ జరుగుతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

చెట్లు.. నెమళ్ళు.. పక్షులు.. వన్య ప్రాణులు ఉన్నాయని వాటిని సంర‌క్షించాల్సింది పోయి నరుక్కుంటూ పోతారా అని సీరియ‌స్ అయ్యింది సుప్రీంకోర్టు. ఈ సంద‌ర్బంగా చీఫ్ సెక్ర‌ట‌రీపై నిప్పులు చెరిగింది. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. అంత అత్యవసరంగా అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిప‌డింది. అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments