NEWSNATIONAL

కాంగ్రెస్ మీడియా కోఆర్డినేట‌ర్ గా సుప్రియా

Share it with your family & friends

భ‌ర‌ద్వాజ్ ను నియ‌మించిన ఏఐసీసీ

న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించి మీడియా ఇంఛార్జ్ గా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ సుప్రియా భ‌ర‌ద్వాజ్ ఎంపిక చేసింది. ఆమెను నియ‌మించిన విష‌యాన్ని పార్టీ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ప‌ష్టం చేసింది. వెంట‌నే ఆమె విధుల్లో చేరుతార‌ని తెలిపింది ఏఐసీసీ.

మీడియా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగి ఉన్నారు. జాతీయ స్థాయిలో ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇండియాకు చెందిన జ‌ర్న‌లిస్టుల‌లో ఒక‌రుగా గుర్తింపు పొందారు సుప్రియా భ‌ర‌ద్వాజ్. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది పార్టీ. ఇందులో భాగంగానే అన్ని పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది. బీజేపీని ఓడించాల‌ని డిసైడ్ అయ్యింది.

పార్టీకి దేశ , అంత‌ర్జాతీయ స్థాయిలలో మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌ని సుప్రియా భ‌ర‌ద్వాజ్ కు కీల‌క పోస్ట్ అప్ప‌గించింది.