అతిపెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ బీజేపీ
కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసింది. అబద్దాలను అద్భుతంగా ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా పేరు పొందిందని ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే స్పందించారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలోనే కాదు వరల్డ్ లోనే అతి పెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ బీజేపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అతి పెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా బీజేపీ తయారైందని, లేనిది ఉన్నట్లు ప్రచారం చేయడంలో దూసుకు పోతోందని, అయినా జనం నమ్మడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని నిజమే అన్నట్లు ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు సుప్రియా శ్రీనాటే.
ఇలాంటి చవకబారు ప్రచారాన్ని ఎంత త్వరగా నిలిపి వేస్తే ఆ పార్టీకి , దాని అనుబంధ సంస్థలకు మంచిదని హితవు పలికారు కాంగ్రెస్ నాయకురాలు. దేశంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయి ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు సుప్రియా శ్రీనాటే.