తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వాయిదా
శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి గురువారం విచారణ చేపట్టింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ లను ఏకి పారేసింది.
దేవుళ్లను రాజకీయాలలోకి లాగొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడంటూ ప్రశ్నించింది.
విచారణకు ముందుగా ఆదేశించకుండా ఎలా తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని చెబుతారంటూ మండిపడింది. ఈ తరుణంలో లడ్డూ వివాదానికి సంబంధించి గురువారం మరోసారి విచారణ చేపట్టింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 10. 30 గంటలకు తిరుమల లడ్డూపై విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని విచారించింది. దీనిపై రేపటి దాకా సమయం కావాలని కోరారు సొలిసిటర్ జనరల్. దీంతో వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది కోర్టు.