NEWSNATIONAL

అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

Share it with your family & friends


ఆరు నెల‌ల త‌ర్వాత జైలు నుంచి బ‌య‌ట‌కు

ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆయ‌న‌కు ఆరు నెల‌ల త‌ర్వాత బెయిల్ ల‌భించ‌డం విశేషం. ఇప్ప‌టికే ఇదే కేసుకు సంబంధించి కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూట సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఇటీవ‌లే బెయిల్ పొందారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క‌మైన పాత్ర పోషించారంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశాయి సీఎం కేజ్రీవాల్ పై. ఆయ‌న ఎన్నిక‌ల ముందు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.

ఇవాళ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఢిల్లీతో పాటు పంజాబ్ లో పాగా వేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్ర‌స్తుతం హ‌ర్యానాలో అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఈ త‌రుణంలో పార్టీ చీఫ్, సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బ‌య‌ట‌కు రావ‌డం ఆ పార్టీకి బిగ్ బూస్ట్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉండ‌గా మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్ విడుద‌ల‌పై. ఇంకా ఎంత కాలం త‌ప్పుడు ఆరోప‌ణ‌లతో జైలులో ఉంచుతారంటూ ప్ర‌శ్నించారు.