NEWSTELANGANA

జీవో 46పై స‌ర్కార్ కు కోర్టు నోటీసు

Share it with your family & friends

త‌దుప‌రి విచార‌ణ 27కి వాయిదా

ఢిల్లీ – దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. జీవో నెంబ‌ర్ 46 బాధితుల‌కు మేలు చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి త‌మ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయాల‌ని ఆదేశించింది. తదుపరి విచారణను జ‌న‌వ‌రి 27కు వాయిదా వేసింది.

బాధితుల తరుపున వాదించిన బృందం లో సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సొంది, జీ విద్యాసాగర్, మిథున్ శశాంక్ ఉన్నారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ కు హాజర‌య్యారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, ఏనుగుల రాకేష్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 నెంబ‌ర్ బాధితుల‌ను ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ అండతో, కేటీఆర్ సహకారం తో ఈ కేసులో బాధితులు త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తార‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు.

నిరుద్యోగ యువ‌త గురించి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాల‌ని కోరారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. జనవరి 27 జరిగే విచారణ లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 బాధితుల పక్షాన నిలపడాలని కోరుతున్నాం. ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న‌కు స్వ‌స్తి ప‌లికి తెలంగాణ ప్రాంత గ్రామీణ విద్యార్థి, నిరుద్యోగుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *