సీఎం కామెంట్స్ సుప్రీంకోర్టు సీరియస్
బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు . దీనిపై స్పందించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ కు చెందిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియాకు బెయిల్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వచ్చిందంటూ అనుమానం వచ్చేలా సుప్రీంకోర్టు ధర్మాసనంను ఉద్దేశించి వ్యాఖ్లయు చేశారు సీఎం.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఆయన కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మనీష్ సిసోడియా బయటకు రావడానికి 17 నెలల సమయం పట్టిందని, ఇంకా సీఎం కేజ్రీవాల్ బయటకు రావడానికి వేచి చూస్తున్నారని కానీ 166 రోజులకే కవితకు బెయిల్ రావడం తనను విస్తు పోయేలా చేసిందంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి.
దీనిని సీరియస్ గా తీసుకుంది సుప్రీంకోర్టు. రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసును విచారించింది త్రిసభ్య ధర్మాసనం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అది ప్రజల మనసుల్లో భయాందోళనలను కలిగించేలా చేస్తుందని పేర్కొంది. మనస్సాక్షి, ప్రమాణం ప్రకారం రాజ్యాంగానికి లోబడి తీర్పులు వెలువరిస్తామని , కొంచెం ముందు వెనుకా ఆలోచించి మాట్లాడితే మంచిదని సూచించారు రేవంత్ రెడ్డికి.