సూరజ్ రేవణ్ణపై మరో కేసు నమోదు
స్వలింగ సంపర్కానికి ప్రేరేపించారు
కర్ణాటక – కేంద్ర మంత్రి , మాజీ కర్ణాటక సీఎం జేడీ కుమార స్వామి కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీజేపీ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు. ఇదిలా ఉండగా రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణపై అసహజ లైంగిక కార్యకలాపాలు జరిపారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కేసు నమోదు కాగా తాజాగా రెండో కేసు సూరజ్ రేవణ్ణపై కేసు నమోదు చేశారు.
అసహజమైన సెక్స్ సెక్షన్ 377 కింద రెండో ఫిర్యాదు దాఖలైంది. సూరజ్ పై శివ కుమార్ , చేతన్ , బావ చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదిలా ఉండగా సూరజ్ రేవణ్ణ కు తొలుత సహాయం చేసిన వ్యక్తి కేసు నమోదు చేశాక విచారణలో రేవణ్ణకు వ్యతిరేకంగా మారాడు. అతడు కూడా స్వలింగ సంపర్కానికి బలవంతం చేసినట్లు వాపోయాడు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపి వేసింది. అయితే సూరజ్ రేవణ్ణ ప్రస్తుతం 7 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.