NEWSNATIONAL

ఒకే ఒక్క‌డు సురేష్ గోపీ

Share it with your family & friends

కేర‌ళ నాట సూప‌ర్ విక్ట‌రీ

కేర‌ళ – ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగిన సురేష్ గోపి భార‌తీయ జ‌న‌తా పార్టీ నుండి లోక్ స‌భ స‌భ్యుడిగా గెలుపొందాడు. ఈ సంద‌ర్బంగా త‌ను చ‌రిత్ర సృష్టించారు. కేర‌ళ అంటేనే క‌మ్యూనిస్టులు, వామ‌ప‌క్షాల‌కు పెట్టింది పేరు.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సురేష్ గోపీ ఎంపీగా గెలుపొంద‌డంతో మోడీ ఏరికోరి త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు . ఆయ‌న కేర‌ళ లోని త్రిసూర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ప్ర‌ధాన‌మంత్రి స్వ‌యంగా గోపీకి ఫోన్ చేయ‌డం విశేషం.

ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థిపై ఏకంగా 74 వేల 686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే త‌ను ప‌లు సినిమాల‌లో న‌టించాల్సి ఉండ‌డం, వారికి ఒప్పందాలు చేయ‌డంతో త‌ను మంత్రి వ‌ర్గంలో చేరేందుకు ఇష్ట ప‌డ‌లేదు. చివ‌ర‌కు పీఎం ఫోన్ చేయ‌డంతో గ‌త్యంత‌రం లేక ఓకే చెప్పాల్సి వ‌చ్చింది సురేష్ గోపీకి.

ద‌క్షిణాదిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి అంత‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. సీట్లు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం ఆ పార్టీకి ఒకింత లాభం చేకూర్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాము అనుకున్న ఉత్త‌రాదిన బీజేపీకి ఆశించిన మేర సీట్లు రాబ‌ట్టు కోలేక పోయింద‌.మొత్తంగా క‌మ్యూనిస్టు కంచు కోట‌లో బీజేపీ సురేష్ గోపి రూపంలో కొలువు తీర‌డం అభినంద‌నీయం.