Thursday, April 3, 2025
Homeముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ గా సూర్య

ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ గా సూర్య

యాజ‌మాన్యం సంచ‌ల‌న నిర్ణ‌యం

ముంబై – ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ గా సూర్య కుమార్ యాద‌వ్ ను నియ‌మించింది యాజ‌మాన్యం. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 23న చెన్నై సూప‌ర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది ముంబై ఇండియ‌న్స్. రెగ్యుల‌ర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనివార్య కార‌ణాల‌తో త‌ప్పు కోవ‌డంతో త‌న స్థానంలో సూర్య భాయ్ ను నియ‌మించిన‌ట్లు తెలిపింది . అత‌డిపై ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఒక మ్యాచ్ ఆడ‌కుండా నిషేధం విధించింది. ఇక సూర్య కుమార్ యాద‌వ్ టీ20 భార‌త జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. రోహిత్ శ‌ర్మ కేవ‌లం ఆట‌గాడిగా మాత్ర‌మే ఉండ‌నున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. మొత్తం 10 జ‌ట్లు ఆడ‌నున్నాయి. ప్ర‌ధానంగా ఈసారి హాట్ ఫెవ‌రేట్ గా ఉన్నాయి. ఈసారి దుబాయ్ లో జ‌రిగిన వేలంపాట‌లో కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశాయి ఆయా జ‌ట్ల ఫ్రాంచైజీలు. ఇదిలా ఉండ‌గా గ‌త సీజ‌న్ లో రాజ‌స్థార్ రాయ‌ల్స్ హాట్ ఫెవ‌రేట్ గా ఉండేది. కానీ అనూహ్యంగా ఓట‌మి పాలైంది. గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విజేత‌గా నిలిచింది. ఈసారి త‌ను భార‌త జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇటీవ‌లే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments