శ్రీలంక టూర్ కు సూర్యా భాయ్ స్కిప్పర్
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం
ముంబై – టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న ముంబై క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ కు ప్రమోషన్ లభించింది. తనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ కీలక బాధ్యతలు అప్పగించింది. శ్రీలంకలో పర్యటించే టి20 భారత జట్టుకు కెప్టెన్ గా నియమించింది. తాజాగా జింబాబ్వే టూర్ లో భారత జట్టును 4-1 తేడాతో సీరీస్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన మరో యంగ్ ముంబై క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు వైస్ కెప్టెన్ గా నియమించింది. ఇక ఈ సీరీస్ లో బుమ్రా, రవీంద్ర జడేజాను పక్కన పెట్టారు.
ఇక బీసీసీఐ ప్రకటించిన టి20 జట్టు ఇలా ఉంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాగా , శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ , రింకూ సింగ్ , రియాన్ పరాగ్ , జైస్వాల్ , పంత్ , సంజూ శాంసన్ , పాండ్యా, శివమ్ దూబే , అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , అర్ష్ దీప్ సింగ్ , ఖలీల్ అహ్మద్, సిరాజ్ ఉన్నారు.
వన్డే జట్టు పరంగా చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ కాగా గిల్ వైస్ కెప్టెన్ దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్ , శ్రేయాస్ అయ్యర్, దూబే, కుల్దీప్ యాదవ్ , సిరాజ్ , సుందర్ , అర్ష్ దీప్ సింగ్ , రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ , హర్షిత్ రాణా ను ఎంపిక చేసింది బీసీసీఐ.