రేవంత్ రెడ్డితో ఎస్వీ కృష్ణా రెడ్డి భేటీ
సీఎంను కలిసిన నిర్మాత అచ్చిరెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రముఖులు పోటీ పడుతున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాత అచ్చి రెడ్డితో పాటు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా నిర్మాత, దర్శకులతో కాసేపు ముచ్చటించారు రేవంత్ రెడ్డి.
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తమ సర్కార్ ముందుంటుందని హామీ ఇచ్చారు. దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు మేలు చేకూర్చేలా సహాయం చేస్తామని తెలిపారు ఎనుముల రేవంత్ రెడ్డి.
గతంలో కంటే ఇప్పుడు భారత దేశంలోని ఇతర ప్రాంతాలతో తెలుగు పరిశ్రమ పోటీ పడుతోందన్నారు. ప్రధానంగా దిగ్గజ దర్శకులు కోట్లాది మందిని ప్రభావితం చేసేలా సినిమాలు తీస్తున్నారని కితాబు ఇచ్చారు సీఎం. భవిష్యత్తులో మంచి సినిమాలు తీయాలని సూచించారు నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డికి.