ఆర్టికల్ 370ని పునరుద్దరించండి
స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి
హైదరాబాద్ – ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఆ ఆర్టికల్ ను రద్దు చేయడం వల్ల హిందువులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ పునరాలించాలని కోరారు. ఎవరు అడ్డు చెప్పినా వినవద్దని వెంటనే ఆర్టికల్ 370ని తిరిగి ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా తాజాగా పదవీ విరమణ పొందిన జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించ లేదు.
ఆయనతో పాటు హిందూ పరివార్ , సంస్థలైన ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు స్వామి వ్యాఖ్యలపై నోరు విప్ప లేదు.