SPORTS

స్వ‌ప్నిల్ కుసాలేకు కాంస్య ప‌త‌కం

Share it with your family & friends

షూటింగ్ పోటీలలో మూడో అథ్లెట్

ఫ్రాన్స్ – పారిస్ వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్ పోటీలలో షూటింగ్ విభాగంలో భార‌త దేశానికి చెందిన షూట‌ర్ స్వ‌ప్నిల్ కుసాలే అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించాడు. కాంస్య ప‌తాకాన్ని సాధించాడు. దేశాన్ని గ‌ర్వ కార‌ణంగా నిలిచారు.

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పీలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే పాల్గొన్నాడు. ఇంత‌కు ముందు భార‌తీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్ రెండు ప‌త‌కాల‌ను సాధించింది. ఒక రౌండ్ లో 10.0 క‌చ్చిత‌మైన స్కోర్ సాధించాడు. కుసాలే 451.4 మొత్తం స్కోర్ తో మూడో స్థానంలో నిలిచాడు.

గురువారం ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో స్వప్నిల్ కుసాలే పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకాన్ని అందించాడు. ఈ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ షూటర్‌గా నిలిచాడు .

కుసాలే సాధించిన ఈ ఘనత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పెరుగుతున్న షూటింగ్ పతకాల సంఖ్యను జోడించింది. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో చైనాకు చెందిన వై.కె. లియు 463.6 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకోగా, ఉక్రెయిన్‌కు చెందిన ఎస్. కులిష్ 461.3 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు.