DEVOTIONAL

స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ ప‌ద్మావ‌తి క‌టాక్షం

Share it with your family & friends

ఘ‌నంగా అమ్మ వారి ఉత్స‌వాలు

తిరుప‌తి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం అమ్మ వారు స్వ‌ర్ణ ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్ర ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ ర‌థాన్ని లాగారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంత‌కు ముందు తిరుమ‌ల‌లో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. భ‌క్తులు నిల్చుని ఉన్న క్యూ లైన్ ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు.