NEWSTELANGANA

జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ జంప్

Share it with your family & friends

కాంగ్రెస్ లో చేరిన స్వ‌ర్ణా సుధాక‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ – త్వ‌ర‌లోనే సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టుగానే బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా క‌నిపిస్తోంది. త‌న స‌ర్కార్ ను కూల్చేస్తామంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లిక‌న కేటీఆర్ , కేసీఆర్ ల‌కు దిమ్మ తిరిగేలా కోలుకోలేని రీతిలో దెబ్బ కొడుతూ వస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని, ఇక గేట్లు తెర‌వ‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు.

దీంతో ఆయ‌న చెప్పిన‌ట్టుగానే గులాబీ దండుపాలెం బ్యాచ్ అంతా కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు క్యూ క‌ట్టారు. ఇప్ప‌టికే ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ హ‌స్తం గూటికి చేరారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, త‌న భార్య ప‌ట్నం సునీతా రెడ్డి సైతం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.

తాజాగా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే స్వ‌ర్ణా సుధాక‌ర్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి చ‌ల్లా వంశీ చంద‌ర్ రెడ్డితో క‌లిసి సీఎం స‌మ‌క్షంలో జెండా క‌ప్పుకున్నారు. స్వ‌ర్ణ ప్ర‌స్తుతం పాల‌మూరు జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ గా ఉన్నారు.