NEWSNATIONAL

స్వాతి మ‌లివాల్ పై గాయాలు నిజ‌మే

Share it with your family & friends

నిర్దారించిన మెడికో లీగ‌ల్ కేసు

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ మహిళా హ‌క్కుల క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ , ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ సభ్యురాలు స్వాతి మ‌లివాల్ పై ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి బీభ‌వ్ కుమార్ అతి దారుణంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోపించింది. దీనిపై ఆమె స్వ‌యంగా ఢిల్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

శుక్ర‌వారం వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఇదే స‌మ‌యంలో స్వాతి మ‌లివాల్ ను ప‌రీక్ష‌లు చేసేందుకు ఎయిమ్స్ కు తీసుకు వెళ్లారు. అక్క‌డ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ నిర్వ‌హించారు. ముఖ్యంగా సంచ‌ల‌న నిజాలు వెలుగు చూశాయి.

స్వాతి మ‌లివాల్ ముఖంపై అంత‌ర్గ‌త గాయాలు ఉన్నాయ‌ని మెడికో లీగ‌ల్ కేసు నివేదిక నిర్దారించింది. త‌న‌పై శారీర‌కంగా దాడి చేశార‌ని, సున్నిత‌మైన శ‌రీర భాగాల‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ వాపోయింది బాధితురాలు. ఇదిలా ఉండ‌గా నిన్న రాత్రి దాదాపు నాలుగు గంట‌ల పాటు ఆమెకు వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.

కేజ్రీవాల్ పీఏ బీభ‌వ్ కుమార్ త‌న చొక్కా లాగి దుర్భాష లాడాడ‌ని, ఏడు ఎనిమిది సార్లు కొట్టి, కాళ్ల‌తో త‌న్నాడ‌ని , ఆ స‌మ‌యంలో కేజ్రీవాల్ త‌న ఇంటి వ‌ద్దే ఉన్నాడ‌ని వాపోయింది.