ఆప్ లో స్వాతి కేసు కలకలం
తనపై సీఎం కార్యదర్శి దాడి
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ కూటమిలో కీలకమైన ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రధానంగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు , ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయిన స్వాతి మలివాల్ తన స్వంత పార్టీకి చెందిన సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బీభవ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తన చెంపపై ఆరు సార్లు చెప్పుతో కొట్టాడని , అంతే కాకుండా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశాడని, చెప్పుకోలేని భాగాలపై కూడా తాకాడని , నానా రకాలుగా దుర్భాష లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి దాడికి పాల్పడుతున్నా ఇంట్లోనే ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పట్టించు కోలేదని వాపోయారు.
ఆప్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు స్వాతి మలివాల్. దీంతో కోర్టులో హాజరు పర్చగా పరీక్షలు చేపట్టాలని ఆదేశించింది. మెడికల్ బోర్డు గాయాలు నిజమేనని తేల్చింది. ఇప్పుడు ఆప్ మరో చిక్కుల్లో ఇరుక్కుంది.