NEWSNATIONAL

ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌ను

Share it with your family & friends

ప్ర‌క‌టించిన స్వాతి మ‌లివాల్

న్యూఢిల్లీ – తాను అన్నీ కోల్పోయాన‌ని చివ‌ర‌కు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు డిమాండ్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు స్వాతి మ‌లివాల్. ఆమె దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. త‌న‌పై అకార‌ణంగా దాడి చేశార‌ని , అది సాక్షాత్తు పార్టీ చీఫ్‌, సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే జ‌రిగింద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు స్వ‌యంగా త‌నే పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ సైతం తీవ్రంగా స్పందించారు. విచార‌ణ‌కు ఆదేశించారు.

ఢిల్లీ కోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో స్వాతి మ‌లివాల్ కు ఎయిమ్స్ లో వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టింది. ఇందులో ఆమెకు గాయాలైన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా త‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌న్నిన కుట్ర‌లో భాగ‌మైంద‌ని, ఆమెకు ఏమీ తెలియ‌దంటూ ఇప్ప‌టికే ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. తాను ఏమీ చిన్న పిల్ల‌ను కాన‌ని, త‌న‌పై దాడి జ‌రిగింద‌ని ఆద‌రోపించారు స్వాతి మ‌లివాల్. మొత్తంగా తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది.