చంపినా సరే పోరాడుతూనే ఉంటా
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ హెచ్చరిక
న్యూఢిల్లీ – తనను చంపినా సరే ఆప్ పై పోరాటం చేస్తానని సంచలన ప్రకటన చేశారు ఆప్ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై దాడి జరిగిందని . ఈ మేరకు కేసు కూడా నమోదైంది. స్వాతి మలివాల్ కు వైద్య పరీక్షలు చేపట్టారు. ఇందులో తనకు గాయాలైనట్లు తేల్చింది వైద్య నివేదిక.
అంతే కాకుండా జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యింది. ఈమేరకు విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా స్వాతి మలివాల్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని, కొందరు ఆప్ నేతలు పనిగట్టుకుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఆప్ నుంచి ఓ సీనియర్ నాయకుడు ఫోన్ చేశాడని, తనపై దుమ్మెత్తి పోయాలని, వ్యక్తిగత ఫోటోలను లీక్ చేయాలని, ఎవరు మద్దతిస్తే వారిని బహిష్కరిస్తామని హెచ్చరించేలా ఆదేశాలు వెళ్లాయని జాగ్రత్తగా ఉండాలని సూచించాడని చెప్పారు స్వాతి మలివాల్. మొత్తంగా తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు.