కేజ్రీవాల్ మామూలోడు కాదు
బయటకు రక్షణ కరువు
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య సభ సభ్యురాలు , ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై భౌతికంగా , మానసికంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు విచారణ కొనసాగుతోంది.
తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ప్రముఖ యూట్యూబర్ దేశాన్ని ఊపేస్తున్న, మోదీని, ఆయన పరివారాన్ని, బీజేపీ సర్కార్ ను వణికుస్తున్న ధ్రువ్ రాఠీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనపై చేసిన ఓ వీడియో తనను ఇబ్బందులకు గురి చేసేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది మలివాల్. ఇదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై విరుచుకు పడింది. ధ్రువ్ రాఠీకి సీఎం నుండి మద్దతు లభిస్తోందని ఆరోపించింది. ఇదే సమయంలో సీఎం గనుక బయటకు వస్తే తనకు రక్షణ ఉండదన్నారు స్వాతి మలివాల్.