ఫోన్ ట్యాపింగ్ కలకలం
ప్రభాకర్ రావు కీలకం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతోంది. భారీ ఎత్తున ఆయా పార్టీలకు చెందిన నేతలతో పాటు వివిధ రంగాలలోని ప్రముఖులు, సినీ రంగానికి చెందిన హీరోయిన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అడ్డంగా దొరకడంతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఎవరూ ఊహించని రీతిలో పోలీసు శాఖలో గత కేసీఆర్ సర్కార్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఖాకీలు జడుసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు బృందం ఇప్పటికే సంచలన ప్రకటన చేసింది.
ప్రణీత్ రావు వ్యవహారంలో ఇద్దరు అడిషనల్ ఎప్పీలు అరెస్ట్ అయ్యారు. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. మరో ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావు జంప్ అయ్యారు. వారు ముందస్తు సమాచారం తెలుసుకునే ఇండియా నుంచి పారి పోయినట్లు టాక్.
ప్రణీత్ రావుతో కలిసి ఏఎస్పీలు కుట్ర పన్నారంటూ తేలి పోయింది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావు, డీఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కీలకంగా ఉన్నట్లు టాక్. ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఇళ్లపై ఖాకీలు దాడులు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.