టి20 వరల్డ్ కప్ వేదిక ఖరారు
భారత్..శ్రీలంక నిర్వహణ
ముంబై – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వచ్చే వరల్డ్ కప్ వేదికను ఖరారు చేసింది. భారత్, శ్రీలంక వేదికగా 2026లో టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక భారత జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దీంతో భారత్ నేరుగా అర్హత సాధించింది. టీమిండియాతో పాటు శ్రీలంక కూడా చేరింది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ , సౌతాఫ్రికా , ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ , అమెరికా , విండీస్ , బంగ్లాదేశ్ జట్లు బెర్త్ లు ఖరారు అయ్యాయి.
ఇక టి20 వరల్డ్ కప్ లో సూపర్ -8కి అర్హత సాధించాయి పాకిస్తాన్, కీవీస్, ఐర్లాండ్ . ఆయా జట్లు సాధించిన ర్యాంకింగ్స్ ఆధారంగా కేటాయించింది ఐసీసీ
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన టి20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది భారత జట్టు. రోహిత్ సేన సారథ్యంలోని మన టీం దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది.