73 ఏళ్ల వయసులో కన్నుమూత
అమెరికా – భారత దేశానికి చెందిన ప్రముఖ తబాలా విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. యావత్ ప్రపంచం జాకీర్ మరణంతో విషాదానికి లోనైంది. పద్మ విభూషణ్ తో పాటు నాలుగు సార్లు గ్రామీ అవార్డు ను అందుకున్నారు. జాకీర్ హుస్సేన్ వయసు 73 ఏళ్లు. ఆయన చాలా ప్రశాంతంగా కన్ను మూశారని సోదరి ఖుర్షీద్ ఔలియా వెల్లడించారరు.
జాకీర్ హుస్సేన్ కు భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన మార్చి 9, 1951లో పుట్టారు. లెజండరీ తబలా మాస్టర్ ఉస్తాద్ అల్లా రఖా కొడుకే ఈ తబలా విధ్వాంసుడు. ప్రపంచంలోని అసంఖ్యా సంగీత ప్రేమికుల గౌరవాన్ని పొందాడు. అసాధారణమైన వారసత్వాన్ని మిగిల్చాడు. జాకీర్ మిగిల్చిన ప్రభావం రాబోయే తరాలకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఆరు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో హుస్సేన్ అనేక ప్రసిద్ధ అంతర్జాతీయ, భారతీయ కళాకారులతో కలిసి పనిచేశాడు. ఏడేళ్ల వయసు నుండి రవిశంకర్ , అలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మతో సహా దాదాపు దిగ్గజ కళాకారులతో కలిసి పని చేశాడు. తబలా విధ్వాంసుడిగా పేరు పొందాడు జాకీర్ హుస్సేన్.
.
యో-యో మా, చార్లెస్ లాయిడ్, బేలా ఫ్లెక్, ఎడ్గార్ మేయర్, మిక్కీ హార్ట్ , జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీత విద్వాంసులతో అతను చేసిన అద్భుతమైన రచనలు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు అందించాయి. ప్రపంచ సాంస్కృతిక రాయబారిగా అతని హోదాను సుస్థిరం చేసింది.
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన పెర్కషన్ వాద్యకారుడు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాప సందేశాలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , ఏఆర్ రెహమాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుగులేని గొప్ప విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ అంటూ పేర్కొన్నారు ఎంపీ ప్రియాంక చతుర్వేది. దేశం గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు సీఎం పినరయి విజయన్.