టైటిల్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్
తమిళ సినీ పరిశ్రమకు చెందిన అత్యత జనాదరణ పొందిన నటుడు దళపతి విజయ్ నటించిన దళపతి 69 మూవీకి సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన విజయ్ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. తన ఆఖరి చిత్రం గోట్ అని భావించారంతా.
కానీ దళపతి 69 చివరి మూవీ అంటూ ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళనాట తను కొత్త పార్టీని పెట్టాడు. రాజకీయాలలో పెను సంచలనం రేపాడు విజయ్. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా తళపతి విజయ్ అంటేనే ఓ సెన్సేషన్. తను ఏది చేసినా అది కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది.
మరి రాబోయే ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది వేచి చూడాల్సిందే.