NEWSINTERNATIONAL

తైవాన్‌లో భారీ భూకంపం

Share it with your family & friends

రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రత

తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌ పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియో లాజికల్ సర్వే (యుఎస్ జీఎస్) వెల్లడించింది..

తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు.

భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగి పోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది యుఎస్ జీఎస్ . .

దీంతో, తైవాన్‌ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో​ జనాలు రోడ్ల మీదకు వచ్చారు.

ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే.

ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు..