బిగ్ షాక్ ఇచ్చిన హైద్రాబాద్ నగర పాలక సంస్థ
హైదరాబాద్ – హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) బిగ్ షాక్ ఇచ్చింది. నగరంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసింది. గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జీహెచ్ఎంసీ.
పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేశామని, అయినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసినట్లు ప్రకటించింది. దేశంలోనే పేరు పొందిన సంస్థ తాజ్ హొటల్ . ఇది ప్రముఖ కంపెనీ టాటా సంస్థకు చెందినది. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో సీజ్ చేయడంతో , పూర్తిగా హోటల్ నిర్వాహకులు, యాజమాన్యం కోలుకోలేని షాక్ కు లోనైంది.
తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించింది హైదరాబాద్ నగర పాలక సంస్థ. హోటల్ సీజ్ విషయం సంచలనంగా మారింది.