DEVOTIONAL

రాముడి స‌న్నిధిలో త‌ల‌సాని

Share it with your family & friends

అయోధ్య‌లో పూజ‌లు చేసిన ఎమ్మెల్యే

ఉత్త‌ర ప్ర‌దేశ్ – యూపీలో లోని అయోధ్యలో ఏర్పాటైన శ్రీ‌రాముడి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. రోజుకు వేలాది మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆల‌యానికి చేరుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శ్రీ‌రాముడి విగ్ర‌హ పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింది. అయోధ్య ఆల‌య ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వీక్షించారు.

దేశంలోని సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, చైర్మ‌న్లు , సీఈవోలు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధానంగా సినీ , క్రీడా రంగానికి చెందిన వారు హైలెట్ గా నిలిచారు.

ప్ర‌త్యేకించి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఏకంగా శ్రీ‌వారికి చెందిన ప్ర‌సాదం ల‌డ్డూల‌ను పంపిణీ చేసింది. దాదాపు ల‌క్ష‌కు పైగా ల‌డ్డూల‌ను చేర వేసింది. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌న వేళ‌ల‌ను కూడా మార్చింది అయోధ్య ఆల‌య క‌మిటీ. మొత్తంగా త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.