ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులు రద్దు
ప్రకటించిన తాలిబాన్లపై సర్వత్రా ఆగ్రహం
ఆఫ్గనిస్తాన్ – తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. ఆఫ్గనిస్తాన్ లో బాలికలు, యువతులు, మహిళలపై ఉక్కు పాదం మోపారు. ఎవరైనా సరే బయటకు వచ్చినా లేదా తమ గొంతు వినిపించినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
నిరసన వ్యక్తం చేయడం, తమ అభిప్రాయాలను వెలి బుచ్చడం నిషేధించినట్లు ప్రకటించారు తాలిబన్లు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఒక్కసారిగా యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది.
ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడ మహిళలు దారుణమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్బంగా తాలిబన్లు కఠినమైన నిబంధనలు విధించారు. మహిళలు బయటకు వస్తే ముఖాన్ని, శరీరాన్ని పూర్తిగా కప్పు కోవాలని ఆదేశించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
మహిళలు “అవసరం కోసం” మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలని ప్రకటించారు. ముస్లిమేతర సెలవులను నిషేధించినట్లు తెలిపారు.
పురుషులు మోకాలి పై వరకు షార్ట్స్ ధరిస్తే శిక్ష తప్పదు. బహిరంగంగా పాటలు పాడ కూడదని బ్యాన్ విధించారు తాలిబన్లు.