ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళి సై
కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ
తమిళనాడు – నిన్నటి దాకా గౌరవ ప్రదమైన రాజ్యాంగ బద్దమైన పదవిలో కొనసాగిన తమిళ సై సౌందర రాజన్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. ఏమైందో ఏమో కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఉన్నట్టుండి రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తమిళి సై సౌందర రాజన్ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆమె తమిళనాడుకు చేరుకున్నారు. అక్కడ జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీలో క్రియాశీలకంగా పని చేసేందుకు చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి తన స్వంత స్థలానికి రావడం ఆనందంగా ఉందన్నారు తమిళి సై సౌందర రాజన్.
గతంలో పార్టీ బలోపేతం కావడానికి తన వంతు కృషి చేశానని అన్నారు. ఇవాళ తమిళ నాట బీజేపీకి తిరుగు లేదన్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ చీఫ్ కె. అన్నామలై అని ప్రశంసించారు. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమె ఎంపీగా బరిలోకి దిగనున్నారు.