గవర్నర్ కంటే ప్రజలే ముఖ్యం
తమిళి సై సౌందర రాజన్ కామెంట్
తమిళనాడు – ఎవరైనా అత్యున్నతమైన పదవి ఇస్తే కాదనకుండా తీసుకుంటారు. కానీ ఏకంగా గవర్నర్ పదవినే త్యజించి తాను కూడా ఎన్నికల్లో పాల్గొంటానని ప్రకటించారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ఆమె తాను ముందు నుంచీ ప్రజల మనిషినని నిరూపించు కున్నారు. తెలంగాణ సంస్కృతి, నాగరికత, సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్నారు. అంతకు మించి వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఉన్నట్టుండి షాక్ ఇచ్చారు తమిళి సై సౌందర రాజన్. తాను గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అందరూ విస్తు పోయారు ఆమె తీసుకున్న నిర్ణయానికి . ఎవరైనా గవర్నర్ పదవిని వద్దని అనుకుంటారా అని ప్రశ్నించారు.
కానీ ఇందుకు ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. తాను ప్రజల మధ్య ఉండాలని అనుకుంటానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ కలగదన్నారు. తాను 40 ఏళ్లుగా నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నానని, అందుకే ఎన్నికల బరిలో ఉన్నానని చెప్పారు.