కేంద్రంపై తమిళనాడు సర్కార్ ఆగ్రహం
ఆరు కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వం
తమిళనాడు – నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే సర్కార్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని మంత్రివర్గం కీలక సమావేశమైంది. బుధవారం జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.
ప్రధానంగా కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించింది మంత్రివర్గం. మొత్తం ఆరు తీర్మానాలు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం ఎంకే స్టాలిన్. హిందీ విధింపు, కుల గణనలో జాప్యం, ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను ఖండించారు.
మణిపూర్ హింసాకాండలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. మైనారిటీ హక్కులను ప్రభావితం చేసే వక్ఫ్ బోర్డు సవరణలను వ్యతిరేకించారు ఎంకే స్టాలిన్.
శ్రీలంక బెదిరింపులకు వ్యతిరేకంగా తమిళనాడు మత్స్యకారులను రక్షించాలని పిలుపునిచ్చారు.
తగ్గిన MNREGA నిధులు, పెరుగుతున్న నిరుద్యోగం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పై ఆందోళనలు చేపడతామన్నారు. రైలు ప్రమాదాలు, సమగ్ర శిక్షా నిధుల జాప్యం, కొత్త క్రిమినల్ చట్టాలు వంటి అంశాలు హైలైట్ చేయబడ్డాయి.