NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ తో తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు భేటీ

Share it with your family & friends

త‌మిళ‌నాడులో భ‌వ‌నం క‌ట్టాల‌ని విన‌తి ప‌త్రం

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు వీరంతా .

ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు, కంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారని, వివిధ రంగాల్లో స్థిరపడ్డార‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు.

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంద‌న్నారు. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జయలలిత త‌న పాల‌నా క‌లోంలో ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని వివ‌రించారు డిప్యూటీ సీఎంకు.

కాలక్రమంలో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల లేద‌ని వాపోయారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భవనం నిర్మాణంపై చర్చించాల’ని విజ్ఞప్తి చేశారు. తమ ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని వివరించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌కు.

ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఉప ముఖ్యమంత్రి ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు దేవరకొండ రాజు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఎ.ఎం.మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.