NEWSANDHRA PRADESH

రైత‌న్న‌ల‌కు స‌ర్కార్ ఆస‌రా

Share it with your family & friends

హోం మంత్రి తానేటి వ‌నిత

అమ‌రావ‌తి – త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వ‌నిత‌. రైతుల‌ ఇంటి ముంగిటనే అన్ని సేవలు అందిస్తున్నామ‌ని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల‌కు అవసరమైన అన్ని సేవలు గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.

రైతులందరూ సంతోషంగా ఉండాలన్న‌దే త‌మ స‌ర్కార్ ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారన్నారు. గోపాలపురం మండలం వేళ్ళచింతల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని హోం మంత్రి  ప్రారంభించి ప్ర‌సంగించారు.

త‌మ‌ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని వేళలా రైతులకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండిన ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

నవరత్నాలలో భాగంగా రైతు భరోసా సాయం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు సైతం  సంవత్సరానికి రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.