అనిత కామెంట్స్ తావేటి సీరియస్
జగన్ ను ఏక వచనంతో సంబోధిస్తే ఎలా
అమరావతి – ఏపీ మాజీ మంత్రి తానేటి వనతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. హోం మంత్రిగా కొలువు తీరిన వంగలపూడి అనిత తన స్థాయికి దిగజారి తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏక వచనంతో సంబంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోం మంత్రి అనిత మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా ఫ్రస్టేషన్ లో ఉన్నట్టు కనిపించిందన్నారు. ఓ వైపు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన చెందారు. హత్యలు, అత్యాచారాలు, హత్యా యత్నాలకు కొదవ లేకుండా పోయిందని ఆరోపించారు. తన మంత్రిత్వ శాఖపై పట్టు కోల్పోయిన అనిత వంగలపూడి కప్పి పుచ్చుకునేందుకు తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు వంగలపూడి అనితకు క్లాస్ పీకినట్టున్నాడని అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు తానేటి వనతి. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు మాజీ మంత్రి.